Eric Garcetti: మొదటిసారి షారుఖ్‌ను కలిసినప్పుడు అతనెవరో తెలియదు: ఎరిక్‌ గార్సెట్టీ

డెస్క్‌: అమెరికా దౌత్యవేత్త ఎరిక్‌ గార్సెట్టీ  2023 మేలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను తాను మొదటిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 

Published : 01 Apr 2024 17:49 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అమెరికా దౌత్యవేత్త ఎరిక్‌ గార్సెట్టీ (Eric Garcetti) 2023 మేలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌(Shah Rukh Khan)ను తాను మొదటిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాను షారుఖ్‌ను కలిసినప్పుడు అతనెవరో తెలియదని అనంతరం తన స్నేహితుల  ద్వారా షారుఖ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి తెలుసుకున్నానని అన్నారు.

ఇటీవల ఓ వార్తాసంస్థతో ముచ్చటిస్తున్న సమయంలో గార్సెట్టీ షారుఖ్‌ను కలిసిన విషయం గుర్తు చేసుకున్నారు. ‘‘నేను ఫారుఖ్‌ను ముంబయిలోని అతడి నివాసం మన్నత్‌లో మొదటిసారి కలిసినప్పుడు మేము క్రికెట్ గురించి చర్చించుకున్నాం. ఎందుకంటే ఆయన లాస్‌ ఏంజిల్స్‌ జట్టులో ఓ భాగానికి యజమానిగానే నాకు తెలుసు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను చూసినప్పుడు మా కార్యాలయంలోని వారంతా ఆశ్యర్యపోయారు. మీరు ఎవరిని కలిశారో  తెలుసా.. అతను ఇండియాలోని ప్రముఖ నటుల్లో ఒకరు అని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న పాపులారిటీని, అభిమానులను చూసి షాక్‌ అయ్యాను.’’అని తెలిపారు.

2023 మేలో షారూఖ్‌ను, ఎస్‌ఎస్‌ రాజమౌళిని కలిసినట్లు అప్పట్లోనే గార్సెట్టీ తన ఎక్స్‌ ఖాతాలో వారితో కలిసి తీసుకున్న ఫొటోలను పోస్టు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని