UNGA: ఇరాన్ దాడి పరిస్థితులను సంక్లిష్టం చేస్తుంది: డెన్నిస్ ఫ్రాన్సిస్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో) ఆదివారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated : 14 Apr 2024 15:25 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో) ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ‘దాడి.. ప్రతిదాడుల విషవలయంలో ఈ ప్రాంతం కూరుకుపోవచ్చు. అనివార్యంగా మరిన్ని మరణాలు, బాధ తప్పకపోవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్‌పై డ్రోన్‌లు, క్షిపణులను ప్రయోగించడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళనగా ఉంది. దీని పరిష్కారానికి వివేకవంతంగా ఆలోచించి ముందుకు వెళ్లాలి. శాంతియుత చర్చలే ఈ సమస్యకు ఏకైక మార్గం. ఇరాన్‌ అధికారులు మా మాటను గౌరవిస్తారని ఆశిస్తున్నా. వారు చెప్పినట్లుగానే ఈ రోజు ఇజ్రాయెల్‌పై దాడికి దిగారు. ఇది ఇక్కడితో ఆగిపోతుందని భావిస్తున్నా’ అని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు పెరగకుండా ఉండాలంటే అన్ని పక్షాలు సంయమనం పాటించాలని డెన్నిస్ పిలుపునిచ్చారు. 

సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా శనివారం ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక అధికారులు, మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ మరోసారి తప్పు చేస్తే దాని ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని