Elon Musk: ఫోన్‌ నంబర్‌ లేకుండానే.. ట్విటర్‌లో ఇక ఆడియో, వీడియో కాల్స్‌

ఎక్స్‌ (ట్విటర్‌)లో వీడియో, ఆడియో కాల్స్‌ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు.

Updated : 31 Aug 2023 15:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎక్స్‌ (Twitter)లో వీడియో, ఆడియో కాల్స్‌ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వెల్లడించారు. ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఎక్స్‌ (Twitter)లో కాల్‌ సదుపాయం తీసుకురానున్నట్లు చెప్పారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకు ఫోన్‌ నంబర్‌ అవసరం లేదన్నారు. ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్‌ బుక్‌కు ఎక్స్‌ వేదిక కానుందని.. ఇందులో ఫీచర్లన్నీ ప్రత్యేకంగా ఉంటాయన్నారు.

వీడియో కాల్స్‌ సదుపాయాన్ని తీసుకువచ్చే విషయంపై ఎక్స్‌ సీఈవో లిండా యాకరినో కొన్నిరోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సంస్థలో డిజైనర్‌గా పనిచేస్తున్న ఆండ్రియా కాన్వే కూడా వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ ఎలా ఉంటుందనే విషయాన్ని నెల క్రితమే  ఓ చిత్రాన్ని షేర్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లే ఎగువన కుడివైపున ఉండే డీఎం మెనూలో వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఎక్స్‌లో బ్లూటిక్‌ హైడ్‌, లైవ్‌ వీడియో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని