ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!

స్పెయిన్‌, పోర్చుగల్‌ గగనతలంలో ఓ భారీ ఉల్క కనువిందు చేసింది. ఇది నేలరాలే సమయంలో వచ్చిన వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 

Updated : 19 May 2024 12:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్పెయిన్‌, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ సమయంలో వచ్చిన వెలుగు పగలును తలపించింది. ఒక్కసారిగా చోటు చేసుకొన్న ఈ ఘటనతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 

ఈ వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఉల్కా ఎక్కడ నేలను తాకిందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది క్యాస్ట్రో డైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. వివరాలు పూర్తిగా వెల్లడికావాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

2013లో కూడా రష్యాలోని చెల్యాబిన్స్క్‌ అనే ప్రాంతంలో ఇంతకంటే పెద్ద స్థాయి ఉల్కలు పడ్డాయి. అప్పట్లో ఆ ఉల్కలు భారీగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందుకే ఆ స్థాయిలో నిప్పులు వచ్చాయని పేర్కొన్నారు. అది 500 కిలో టన్నుల టీఎన్‌టీకి సమానమైన శక్తిని విడుదల చేసిందని అంచనావేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు