Vladimir Putin: పుతిన్ చేతులు రంగు మారాయ్.. ఎందుకో..?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల క్యూబా అధ్యక్షుడితో చర్చలు జరిపిన సమయంలో తీసిన ఫొటోల్లో ఆయన చేతులు రంగుమారాయి. దీనికి కారణం ఏంటని సామాజిక మాధ్యమాల్లో చర్చలు మొదలయ్యాయి.
మాస్కో: ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, క్యూబా అధ్యక్షుడు మిగుయేల్ డియాజ్ కానెల్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పశ్చిమ దేశాలకు తమ ఉమ్మడి శత్రువు అమెరికా ఇస్తోన్న అనుమతులపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశాల మాట పక్కన పెడితే.. ఇరు దేశాల అధ్యక్షులు కరచాలనం చేస్తున్న సందర్భంలో క్లిక్‌మనిపించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఫొటోల్లో పుతిన్ చేతులు రంగు మారడమే అందుకు కారణం. ఆయన చేతులు పర్పుల్ రంగులో కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆర్మీ మాజీ అధికారి, హౌస్ సభ్యుడు లార్డ్స్ రిచర్డ్ దనత్ స్పందించారు. చేతులపై ఉన్న మచ్చలను నిశితంగా పరిశీలిస్తే.. ఇంజక్షన్ సూదులు గుచ్చడం వల్ల ఏర్పడినట్లుగా కనిపిస్తోందని అన్నారు. దానివల్లే బహుశా చేతులు రంగుమారి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఇటీవల ఆయన చేతులపై నలుపు రంగు మచ్చలు కనిపించడం కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇవి నరాల్లోకి ఔషధాలు ఎక్కించడం వల్ల ఏర్పడిన మచ్చలేనని చాలా మంది పేర్కొన్నారు.
ఈమధ్య కాలంలో పుతిన్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, వైద్యం చేయించుకునేందుకే కొన్ని వారాల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. వ్యాధి తీవ్రత అడ్వాన్స్ స్థాయికి చేరినట్లు వెల్లడించాయి. మరోవైపు, పుతిన్ అధ్యక్ష బాధ్యతలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పనున్నారని, ఆయన స్థానంలో వేరే వ్యక్తి ఆ బాధ్యతలు అప్పగిస్తారని కూడా వదంతులు గుప్పుమన్నాయి. కానీ, కొన్ని రోజుల తర్వాత రష్యాలోని వివిధ అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ ప్రత్యక్షమవ్వడంతో ఆ వార్తలకు బ్రేక్‌పడింది. కానీ, తాజాగా ఆయన చేతులు రంగు మారడంతో పుతిన్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Vande Metro: ఊళ్ల నుంచి నగరాలకు ‘వందే మెట్రో’.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
-
Movies News
Kadambari Kiran: నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె వివాహం.. హాజరైన సినీ తారలు
-
India News
రామ్ రామ్ అనమంటూ కుక్కకు ఎమ్మెల్యే శిక్షణ
-
Movies News
Director Sagar: సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత
-
Politics News
Balineni: నిరూపించలేకపోతే పోటీనుంచి తప్పుకొంటారా?: కోటంరెడ్డికి బాలినేని సవాల్
-
General News
Top Ten News @ 9 AM: బడ్జెట్ ప్రత్యేకం.. ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు