German Envoy: భారత ఎన్నికలను గమనిస్తున్నాం: జర్మన్ రాయబారి

భారత్‌లో జరగనున్న ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికలను జర్మనీ గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్ అన్నారు. ఆ ప్రక్రియను తాము గౌరవిస్తున్నామన్నారు.  

Updated : 16 Apr 2024 13:27 IST

దిల్లీ: భారత్‌లో జరగనున్న ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికలను జర్మనీ ఆసక్తిగా గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్ అన్నారు. ఈ ప్రక్రియను తాము గౌరవిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అంతర్జాతీయ వేదికపై భారత్‌ ప్రభావం మరింత పెరుగుతుందన్నారు. G20 సదస్సుకు న్యూదిల్లీ ఆతిథ్యమిచ్చినప్పుడే ఆ విషయం అర్థమైందన్నారు. సోమవారం ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఫిలిఫ్‌ విద్యార్థులతో ముచ్చటించారు.

‘ప్రస్తుతం భారత్‌ ఎంత వేగంగా ఎదుగుతోందో మనం చూస్తున్నాము. ఇక్కడ ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్న ఎన్నికలను మేం ఉత్సుకతతో గమనిస్తున్నాము. ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికపై న్యూదిల్లీ ముద్ర మరింత స్పష్టంగా ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన G20 సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించిందని ఫిలిప్ విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ సదస్సుకు సంబంధించి మొత్తం 28 రాష్ట్రాలు, 8కేంద్ర పాలిత ప్రాంతాలు, 60 నగరాల్లో రెండు వందలకు అనుబంధ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రపపంచ దేశాల్లో కేవలం భారత్‌కు మాత్రమే ఇది సాధ్యమని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని