Hamas: వాళ్లని గాజా నుంచి తరలించడం ఉరిశిక్షతో సమానం: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన హెచ్చరికలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. రోగులను తరలించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

Published : 15 Oct 2023 04:59 IST

జెనీవా: తమ దేశంపై దాడి చేసిన హమాస్‌ (Hamas) ఉగ్రవాదుల్ని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ (Israel) సైన్యం గాజాలో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న పాలస్తీనా ప్రజల్ని దక్షిణ గాజాకి తరలి వెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. కాగా.. ఇజ్రాయెల్‌ హెచ్చరికలను పట్టించుకోవద్దని స్థానికులకి హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా సూచించారు. ఉన్న ప్రాంతాన్ని వదిలి ఎక్కడి వెళ్లొద్దని కోరారు. మరోవైపు గాజాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న రోగుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చెసింది. గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికల్ని తీవ్రంగా ఖండించింది. 

‘‘రోగులు, వైద్య సిబ్బందిని బలవంతంగా తరలించడం అనేది మానవత్వాన్ని, ప్రజారోగ్య వ్యవస్థ మరింత దిగజార్చుతుంది. ఇప్పటికే దక్షిణా గాజా ఆస్పత్రులు రోగులతో నిండి ఉన్నాయి. ఇప్పుడు మరో 2 వేల మందిని అక్కడికి తరలిస్తే పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. అది వాళ్లకి ఉరిశిక్షతో సమానం. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లు, లైఫ్‌ సపోర్ట్‌, డయాలసిస్‌ అవసరమయ్యే వాళ్లు, ఆరోగ్య సమస్యలున్న గర్భిణీలకు చికిత్స ఆలస్యమై ప్రాణాల మీదకొస్తుంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తర గాజాలో ఉన్న రోగులను అక్కడే వదిలేసి వెళ్లలేక, తరలించి వారి ప్రాణాలను ప్రమాదంలో నెట్టలేక వైద్య సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని