Pakistan: పాకిస్థాన్‌ చేతికి చైనా నిఘా నౌక..!

పాకిస్థాన్‌ చేతికి తొలి నిఘా నౌక వచ్చింది. దీనిని చైనాలో నిర్మించారు. ఇది గగనతలం, సముద్రంపై ప్రత్యర్థి దళాల కదలికలను గుర్తించగలదు. 

Published : 17 Mar 2024 18:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ (Pakistan) నేవీలో మొట్టమొదటి సారి నిఘా నౌక చేరింది. చైనా (China) సాయంతో సమకూర్చుకున్న ఈ షిప్‌నకు అణు వార్‌ హెడ్‌లు ఉన్న బాలిస్టిక్‌ క్షిపణులను కూడా ట్రాక్‌ చేసే సామర్థ్యం ఉంది. దీంతోపాటు ఇతర కీలక సమాచారాన్ని కూడా సేకరించగలదు. 87 మీటర్లు పొడవున్న దీనికి ‘పీఎన్‌ఎస్‌ రిజ్వాన్‌’ అని పేరుపెట్టారు. దాదాపు 19 మీటర్ల వెడల్పు ఉన్న దీనిలో 48 సిబ్బంది ప్రయాణించవచ్చు.  ఇందులో రాడార్లు, ఇతర ట్రాకింగ్‌ సిస్టమ్‌లు ఉన్న మూడు డోములున్నాయి.  

హిందూ మహా సముద్రంపై చైనా దృష్టి పెట్టడంతో పాక్‌ నౌకాదళ సామర్థ్యాన్ని పెంచే పనిని చైనా మొదలుపెట్టింది. గతేడాదే దీనిని చైనా నుంచి పాక్‌కు చేర్చారు. ఈ క్రమంలో జూన్‌లో ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను ఆపేశారు. నాటి నుంచి ఇటీవల వరకు ఇది కరాచీ పోర్టులోనే ఉంది. ఇక ఈ నౌకను ఫూజౌలోని ఫుజియాన్‌ మావై షిప్‌బిల్డింగ్‌ సంస్థ నిర్మించింది. ఇది చైనాలో అత్యంత పురాతనమైన నౌకా నిర్మాణ కంపెనీ.  

ఇప్పటికే భారత్‌ వినియోగిస్తున్న ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌ కంటే ఇది చిన్నది. మన నౌకను 2021లో నౌకాదళంలో చేర్చారు. దీని నిర్మాణానికి దాదాపు ఏడేళ్ల సమయం పట్టింది. రూ.1500 కోట్ల వ్యయం అయింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, భారత్‌ వద్ద మాత్రమే ఇటువంటి నిఘా నౌకలున్నాయి. తాజాగా ఈ జాబితాలో పాక్‌ కూడా చేరినట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని