X Premium: మస్క్‌ ‘ఎక్స్‌’ తో ఓ భర్తకు వింత చిక్కులు..

భార్య, భర్తల మధ్య ఎక్స్‌ ప్రీమియం (X premium) చెల్లింపుపై జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది.

Published : 07 Aug 2023 17:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎక్స్‌ ప్రీమియం (X premium) చెల్లింపుపై భార్య, భర్తల మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన అలెక్స్‌ కోహెన్‌ అనే పారిశ్రామిక వేత్త తన భార్య చేసిన మేసేజ్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిని దాదాపు 10 లక్షల మంది వీక్షించగా, 7,300 లైక్స్‌ వచ్చాయి.

‘మీరు ప్రతి నెలా 8 డాలర్లు ఎవరికీ  చెల్లిస్తున్నారని ఆమె ప్రశ్నించగా.. కోహెన్‌ దానికి స్పందిస్తూ.. అయ్యో దీని గురించి నేను ఎలా చెప్పాలి.’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ చాటింగ్‌ నెట్టింట వైరల్‌ అవ్వడంతో పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ‘మీరు సరైన సమాధానం చెప్పకపోతే చిక్కుల్లో పడతారు.’ బేబీ ఇది నా ఎక్స్‌ ప్రీమియం నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌కు చెల్లించిన బిల్ మాత్రమే ప్రామిస్‌. ’ అని రాసుకోచ్చారు.

ట్విటర్‌లో నకిలీ ఖాతాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో  ఎలాన్‌ మస్క్‌   ఈ ‘బ్లూ టిక్‌’ సర్వీసులో మార్పులు తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే. నెలవారీ ఛార్జీలతో ప్రీమియం వెర్షన్‌ను తీసుకొచ్చారు. అంటే.. నెలకు 8 డాలర్లు చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండానే ‘బ్లూ టిక్‌’ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని