Zelensky: పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్‌స్కీ అభ్యర్థన

స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి సదస్సుకు చైనా, గ్లోబల్‌ సౌత్ దేశాలు తమ ప్రతినిధులను పంపాలని జెలెన్‌స్కీ(Zelensky) కోరారు. 

Published : 18 May 2024 20:38 IST

స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి సదస్సుకు చైనా, గ్లోబల్‌ సౌత్ దేశాలు తమ ప్రతినిధులను పంపాలని జెలెన్‌స్కీ(Zelensky) కోరారు. 

 

 

కీవ్‌: రష్యా యుద్ధంలో ఓడిపోతే.. అది అమెరికాకు దక్కిన విజయంగా చైనా భావిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) అన్నారు. పశ్చిమదేశాలు రష్యా-ఉక్రెయిన్ ల మధ్య సమతూకం తేవాలని కోరుకుంటున్నాయన్నారు. ఈ ప్రక్రియలో చైనా భాగం కావాలని కోరారు.

ఉక్రెయిన్ కోసం ఈ జూన్‌లో శిఖరాగ్ర శాంతి సదస్సు నిర్వహిస్తామని స్విట్జర్లాండ్‌ ప్రకటించింది. ఇందులో చైనా, గ్లోబల్‌ సౌత్‌ దేశాలు పాల్గొనాలని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ కోరారు. అయితే డ్రాగన్ హాజరవుతుందో లేదో స్పష్టత రావాల్సిఉంది. అయితే ఈ సదస్సుకు ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని మాత్రం చెప్పింది. అలాగే తమది తటస్థ పక్షమని పునరుద్ఘాటించింది. చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించిన నేపథ్యంలో జెలెన్‌స్కీ స్పందన రావడం గమనార్హం.

ఇదిలాఉంటే రెండేళ్లకుపైగా సాగుతోన్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ఇటీవల ఖర్కీవ్‌ నగరంపై పుతిన్‌ సేనలు విరుచుకుపడ్డాయి. దీనిపై అధ్యక్షుడు స్పందిస్తూ..  ఖర్కీవ్‌ ప్రాంతంలో బఫర్‌ జోన్‌ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని, ఆ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రణాళికలేవీ తమకు లేవని స్పష్టంచేశారు. చైనాలో ఆయన రెండు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈసందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి చర్చల ద్వారా ముగింపు పలికేందుకు తాము సిద్ధమేనని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని