Zelensky: వరదలో కొట్టుకొస్తున్న మందుపాతరలు.. ఆ డ్యామ్ ఓ టైం బాంబ్..!
ఉక్రెయిన్‌లోని కఖోవ్కా డ్యాం పరిధిలో పరిస్థితి ఘోరంగా ఉంది. చాలా చోట్ల నీరు 5 మీటర్లకుపైగా ఎత్తుకు చేరింది. ఇరు వర్గాల సేనలు పలు చోట్ల పాతిన మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయి.. జనావాసాల్లోకి చేరుతున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్, రష్యా దళాలు అమర్చిన యాంటీ ట్యాంక్ మైన్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇవి ఎక్కడి వెళ్లాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సహాయక బృందాలకు ప్రాణాంతకంగా మారింది.
పులిమీద పుట్రలా మందుపాతరలు..
కఖోవ్కా డ్యాం వరద దెబ్బకు స్థానికులు భయంభయంగా జీవిస్తున్నారు. ఆ ప్రదేశంలో ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా దళాలు అమర్చిన మందుపాతరలను గుర్తించి తొలగించడం చాలా కష్టంగా మారిందని రెడ్‌క్రాస్ పేర్కొంది. ముఖ్యంగా ఇక్కడ టీఎం-57 మైన్లను అమర్చారు. వరద దెబ్బకు ఇక్కడ పాతిన ఆ మందుపాతరలు దిగువ ప్రదేశాలకు కొట్టుకుపోయాయి. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆ మైన్లు అక్కడి ప్రజలకే కాదు.. సహాయక బృందాలకు కూడా ముప్పుగా మారాయి. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మైన్లు ఉండొచ్చని రెడ్‌క్రాస్ చెబుతోంది.
జెలెన్‌స్కీ పర్యటన..
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేడు వరద తాకిడి ప్రదేశాలను సందర్శించారు. ప్రజలను ఖాళీ చేయించిన ప్రదేశాలకు కూడా ఆయన వెళ్లారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. స్థానిక ఎమర్జెన్సీ వర్కర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ‘‘ప్రజల ప్రాణాలను కాపాడటమే మా విధి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహాయక బృందాలు, వాలంటీర్లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
దక్షిణ ఖేర్సాన్‌లో దాదాపు 600 కిలోమీటర్ల మేర భూభాగం నీటమునిగింది. ఈ విషయాన్ని స్థానిక ఉక్రెయిన్ మిలటరీ కమాండర్ ధ్రువీకరించారు. చాలా చోట్ల నీటి మట్టం 5.61 మీటర్లకు చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా నీపర్ నది తూర్పు భాగం లోతట్టులో ఉండటంతో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. మొత్తం వరదలో దాదాపు 60శాతానికి పైగా తూర్పు తీరంలోనే ఉంది. మరో 30శాతం పశ్చిమ భాగాన ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చాలా చోట్ల నీటిలో చిక్కుకుపోయిన వారి వద్ద మంచినీరు కూడా లేకపోవడంతో డ్రోన్ల సాయంతో వాటర్ బాటిళ్లను జారవిడుస్తున్నారు.
ఓ వైపు వరద తీవ్రత ఎక్కువగా ఉన్నా.. మరో వైపు రష్యా దళాలు కాల్పులు జరుపుతున్నాయని ఉక్రెయిన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వరద సహాయ బృందాలపై కాల్పులు జరుగుతున్నాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. జర్మనీకి చెందిన ఓ పత్రికతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.
డ్యామ్ విధ్వంసం ఉద్దేశపూర్వకమా..?
గతేడాది ఆగస్టు, నవంబర్‌లో జరిగిన పోరు కారణంగా డ్యామ్ కొంత దెబ్బతిందని నిపుణులు వెల్లడించారు. మరికొందరు నిపుణులు మాత్రం ఈ ఆనకట్ట రష్యా ఆధీనంలో ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే నీటి నిల్వలను సామర్థ్యానికి మించి పెంచి డ్యామ్ దెబ్బతీసేట్లు చేశాయని పేర్కొన్నారు.
ఇక ఆనకట్ట వద్ద పరిస్థితులకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను అమెరికాలోని ఫారెన్ అగ్రికల్చర్ సర్వీస్ సేకరించింది. వీటిని విశ్లేషించగా.. గత కొన్ని నెలల్లో నీటి నిల్వలు వేగంగా పెరిగినట్లు గుర్తించింది. అప్పటికే జరిగిన పోరు కారణంగా డ్యామ్ దెబ్బతినగా.. ఆపై నీటి నిల్వలు పెరగడం దానిని కుప్పకూల్చిందని అనుమానిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించాలి.. ఓయూలో విద్యార్థుల ఆందోళన
-
Vande bharat express: కాచిగూడ- యశ్వంత్‌పూర్, చెన్నై- విజయవాడ టికెట్ ధరలివే..!
-
High Speed Train: ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్.. వెల్లడించిన రైల్వే మంత్రి
-
Vizag: గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసి.. విశాఖలో బాలుడి హత్య
-
ICC Rankings: మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం
-
Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్ ఆఫర్.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!