Nara Lokesh: అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నింటినీ గాడిన పెడతాం: నారా లోకేశ్‌

వైకాపా పాలనలో ఆరోగ్య శ్రీ పథకం ‘అనారోగ్యశ్రీ’ లా మారిందని మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేశ్‌ విమర్శించారు.

Published : 23 Apr 2024 14:56 IST

వైకాపా పాలనలో ఆరోగ్య శ్రీ పథకం ‘అనారోగ్యశ్రీ’ లా మారిందని మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేశ్‌ (Nara Lokesh) విమర్శించారు. సంక్షేమ పథకాలు రద్దు చేసి పేదలను, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి కొండపనేని టవర్స్ వాసులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ గాడిని పెట్టే బాధ్యత తీసుకుంటామన్నారు. చేనేత అభివృద్ధికి అన్నిరకాలుగా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.  

Tags :

మరిన్ని