Chandrababu: ఆడబిడ్డలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ: చంద్రబాబు

ఆడబిడ్డలను లక్షాధికారులను చేసే బాధ్యత తనదని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

Published : 23 Apr 2024 15:46 IST

ఆడ పిల్లలకు పుట్టినిల్లు తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ‘‘మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి దివంగత నేత ఎన్టీఆర్. కానీ జగన్ మాత్రం ఆయన చెల్లెమ్మకు ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేసే బాధ్యత నాది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

మరిన్ని