Chandrababu: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కాకుండా.. సీఎం ఎక్కడో పర్యటిస్తున్నారు: చంద్రబాబు

మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు వద్ద ఆందోళన చేపట్టిన రైతులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తుండగా..  రైతులను చూసి వారితో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం ఇంతవరకు నష్టం అంచనాకు రాలేదని చంద్రబాబు వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తాను పర్యటనకు వస్తున్నానని తెలిసి సీఎం జగన్ హడావుడిగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరారని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు.

Updated : 08 Dec 2023 16:20 IST
Tags :

మరిన్ని