భూవివాదం కేసులో కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు. మన్నెగూడ భూవివాదం కేసులో ఏ1గా ఉన్నాడు. మంగళవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కె.కన్నారావు, మరో 35 మందిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైంది. మన్నెగూడలో 2 ఎకరాల కబ్జాకు యత్నించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. 

Published : 02 Apr 2024 15:13 IST
Tags :

మరిన్ని