Gorantla Butchaiah: ఓటమిని చవిచూసినా.. జగన్ ఇంకా మారలేదు: గోరంట్ల బుచ్చయ్య

సీఎంగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణస్వీకారం చేస్తారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు.

Updated : 06 Jun 2024 16:05 IST

సీఎంగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణస్వీకారం చేస్తారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (Gorantla Butchaiah) తెలిపారు. ప్రమాణస్వీకారానికి ప్రధాని సహా పలు పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నారని వెల్లడించారు. ఓటమిని చవిచూసినా జగన్ ఇంకా మారలేదని బుచ్చయ్యచౌదరి విమర్శించారు. అసహనంతో తెదేపా శ్రేణులపై దాడులకు ప్రేరేపిస్తున్నారని తప్పుబట్టారు. పైగా తాము దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Tags :

మరిన్ని