Harish Rao: కేసీఆర్‌కు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ: హరీశ్‌ రావు

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు మాజీ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) తెలిపారు. యశోద ఆస్పత్రి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘గురువారం కేసీఆర్‌ బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. నొప్పి ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకొచ్చాం. పరీక్షలు చేసిన వైద్యులు.. తుంటి ఎముక విరిగిందని చెప్పారు. కేసీఆర్‌కు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స తర్వాత వైద్యులు హెల్త్‌బులెటిన్‌ విడుదల చేస్తారు. అనుమతి లేనందున భారాస శ్రేణులు, కేసీఆర్‌ అభిమానులు ఆస్పత్రి వద్దకు రావొద్దు’’ అని చెప్పారు. 

Updated : 08 Dec 2023 17:06 IST
Tags :

మరిన్ని