Harishrao: సీఎం రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా: హరీశ్‌రావు

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Updated : 24 Apr 2024 14:44 IST

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఏకకాలంలో రైతురుణమాఫీ సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన అన్ని గ్యారంటీలను ఆగస్టు 15 లోపు అమలు చేస్తామని సీఎం రేవంత్‌ ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని