భారాస నేతలకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి: మర్రి రాజశేఖర్‌ రెడ్డి

భారాస కార్పొరేటర్లు, నాయకులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని మర్రి రాజశేఖర్‌ రెడ్డి (Marri Rajashekar Reddy) ఆరోపించారు. ఆన్‌లైన్‌ను ఉపయోగించి కొందరు దుండగులు స్పూఫ్‌ కాల్స్‌ చేస్తూ కుటుంబాలను నాశనం చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. దీనిపై మేడ్చల్‌ జిల్లా నేరేడ్‌మెట్‌లో రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలో దుండగులపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Published : 08 Dec 2023 19:56 IST
Tags :

మరిన్ని