TDP: చంద్రబాబు తరఫున నామినేషన్‌.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలోని ప్రసన్న వరదరాజస్వామి, మసీదు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  

Published : 19 Apr 2024 13:38 IST

తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబూ నగర్‌లోని చర్చిలో ప్రార్థనలు చేశారు. 

Tags :

మరిన్ని