మంగళగిరిని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడమే లోకేశ్‌ విజన్‌: నారా బ్రాహ్మణి

మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే నారా లోకేశ్‌ విజన్‌ అని ఆయన సతీమణి బ్రాహ్మణి తెలిపారు.

Updated : 21 Apr 2024 12:41 IST

ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు.

Tags :

మరిన్ని