BRS: కవిత అరెస్ట్‌తో నిజామాబాద్‌ భారాస శ్రేణుల్లో నైరాశ్యం

భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ కావడం నిజామాబాద్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఇందూరు లోక్‌సభ స్థానంపై పట్టు, గతంలో ఎంపీగా పనిచేసిన ఆమె అనుభవం.. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు కలిసి వస్తుందని భావించారు. కానీ, కవిత అరెస్ట్‌తో జిల్లాలో గులాబీ పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లాయి. ఇప్పటికే చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్తుండగా.. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భారాసను సమన్వయం చేసే పెద్దదిక్కు లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది.

Published : 28 Mar 2024 10:11 IST

Tags :

మరిన్ని