Modi-Rashmika: రష్మిక వీడియోపై స్పందించిన ప్రధాని మోదీ

దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. 

Published : 17 May 2024 18:51 IST

దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌హార్బర్‌ లింక్’ (MTHL)పై సినీనటి రష్మిక (Rashmika Mandanna) ఇటీవల ప్రయాణించారు. అటల్‌సేతుగా పిలిచే ఆ వంతెనను కారులో నుంచి వీక్షిస్తూ.. దాని గురించి మాట్లాడుతున్న వీడియోను రష్మిక తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. దీనిపై తాజాగా ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని బదులిచ్చారు.  

Tags :

మరిన్ని