Darsi: పసిబిడ్డకు ప్రాణం పోసిన కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో ఉన్నా.. వృత్తి ధర్మాన్ని పాటించి మానవత్వాన్ని చాటుకున్నారు. 

Published : 19 Apr 2024 15:58 IST

ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో ఉన్నా.. వృత్తి ధర్మాన్ని పాటించి మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యురాలైన గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తుండగా అత్యవసర పరిస్థితి తలెత్తింది. అబ్బాయిపాలెంకు చెందిన ఓగర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. సమయానికి గైనకాలజిస్ట్ అందుబాటులో లేక గుంటూరు లేదా ఒంగోలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.  విషయం తెలుసుకున్న డాక్టర్ లక్ష్మి ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చి గర్భిణి ఉన్న ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ చేసి తల్లీ బిడ్డను కాపాడారు.

Tags :

మరిన్ని