వంద మంది పోలీసులు నా ఆఫీసును చుట్టుముట్టాల్సిన అవసరమేంటి?: బొండా ఉమా

తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా (TDP) నేత బొండా ఉమా (Bonda Uma) అన్నారు.

Published : 20 Apr 2024 12:57 IST

తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా (TDP) నేత బొండా ఉమా (Bonda Uma) అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద మంది పోలీసులు శుక్రవారం తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సీపీ తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్‌ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్‌లో ఉన్న వేముల సతీష్‌ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని బొండా ఉమా తెలిపారు. 

Tags :

మరిన్ని