Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 10 Jun 2024 10:01 IST

రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను’ అంటూ సాగే ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి ఎదురుచూస్తుండగా ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుతున్నారు. ప్రముఖులు, అతిథిల కోసం ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రధాని రానున్నందున పటిష్ట భద్రతా వలయం ఇప్పటికే విధుల్లోకి దిగింది. ఐదు ప్రదేశాల్లోని 65 ఎకరాల్లో వేర్వేరుగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయగా విజయవాడ నగర హోటళ్లల్లోని గదులన్నీ నిండిపోతున్నాయి

Tags :

మరిన్ని