Harishrao: అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్‌ ఇచ్చేవరకు వదిలిపెట్టం: హరీశ్‌రావు

ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చేవరకు వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) స్పష్టంచేశారు.

Published : 24 May 2024 19:28 IST

ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చేవరకు వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) స్పష్టంచేశారు. రైతుల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతన్‌కల్‌లో క్రాప్ హాలిడే ప్రకటించిన కర్షకులను ఆయన కలిశారు. జులైలో జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో రైతులు అసెంబ్లీని ముట్టడిస్తారని హరీశ్‌రావు వెల్లడించారు.  

Tags :

మరిన్ని