Chandrababu: కేంద్రంలో మళ్లీ కీలకంగా చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ దిల్లీలో కీలకంగా మారారు.

Published : 06 Jun 2024 09:17 IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu) దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ దిల్లీలో కీలకంగా మారారు. ఈ నెల 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం అవతరించడం, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ మద్దతు అవసరమవడంతో జాతీయ మీడియా మొత్తం చంద్రబాబు వైపు మోహరించింది. భాజపా ఎక్కువ లోక్‌సభ స్థానాల సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ మార్కు 272కు ఇంకా 32 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో మిత్రపక్షాల మద్దతు మోదీకి అనివార్యమైంది.

Tags :

మరిన్ని