Chandrababu: తెదేపాకు చంద్రబాబే ఒక సైన్యం

ఆయనకు జయాపజయాలు కొత్తకాదు. పోరాటాలు కొత్త కాదు. పదవులూ కొత్త కాదు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ సంక్షోభాలకు ఎదురొడ్డారు. వైకాపా ముప్పేట దాడిని రాజకీయ చాణక్యంతో ఎదుర్కొన్న చంద్రబాబు పసుపు కోటకు అతడే ఒక సైన్యమని నిరూపించుకున్నారు.

Published : 05 Jun 2024 14:23 IST

ఆయనకు జయాపజయాలు కొత్తకాదు. పోరాటాలు కొత్త కాదు. పదవులూ కొత్త కాదు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ సంక్షోభాలకు ఎదురొడ్డారు. కిందపడిన ప్రతీసారీ ఉవ్వెత్తున పైకి లేచారు. కానీ అవన్నీ ఒక ఎత్తు. గత ఐదేళ్ల రాజకీయం మరో ఎత్తు. పార్టీ పనైపోయిందనే సూటిపోటి మాటలు, ఆనవాళ్లే లేకుండా చేస్తామని హెచ్చరికలు, భౌతిక దాడులు, అక్రమ కేసులు, అరెస్టులు. చివరకు కక్షగట్టి జైలుకు పంపినా ఆయన గుండె తట్టుకుంది. తిరగబడింది. వైకాపా ముప్పేట దాడిని రాజకీయ చాణక్యంతో ఎదుర్కొన్న చంద్రబాబు పసుపు కోటకు అతడే ఒక సైన్యమని నిరూపించుకున్నారు.

Tags :

మరిన్ని