Chandrababu: ‘ప్రత్యేక కుర్చీ వద్దు’.. కూటమి సమావేశంలో చంద్రబాబు సంస్కారం

తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Updated : 11 Jun 2024 13:09 IST

తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) వేదికపై ఆసీనులయ్యారు. వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీని సిద్ధం చేయగా ఆయన తిరస్కరించారు. కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీ ఉండాలని మరో కుర్చీని తెప్పించి దానిపై కూర్చొన్నారు. దీంతో ఆయన సంస్కారాన్ని ప్రజలు కొనియాడుతున్నారు.

Tags :

మరిన్ని