Chandrababu: ఇకపై రోడ్లు మూసేయడం, పరదాలు కట్టుకోవడం ఉండవు: చంద్రబాబు

తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు.

Published : 11 Jun 2024 14:47 IST

తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘సీఎం పర్యటనల సందర్భంగా షాపులు బంద్‌ చేయడం, రోడ్లు మూసేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా మామూలు మనిషే. మామూలు మనిషిగానే వస్తా. మిత్రుడు పవన్‌తో పాటు మేమంతా సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తాం. మీలో ఒకరిగా ఉంటాం. హోదా సేవ కోసమే తప్ప.. పెత్తనం కోసం కాదు. ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. ‘స్టేట్‌ ఫస్ట్’ అనే నినాదంతో ముందుకెళ్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు