Kanakamedala: తెలుగుదేశానికి ఏపీ అభివృద్ధే ముఖ్యం.. పదవులు కాదు: కనకమేడల

తెలుగుదేశానికి (TDP) ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమని, పదవులు కాదని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు.

Published : 07 Jun 2024 16:21 IST

తెలుగుదేశానికి (TDP) ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమని, పదవులు కాదని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునరంకితమవుతామన్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉంటూ కేంద్ర సహకారంతోనే రాష్ట్రానికి కావాల్సిన వాటిని సాధిస్తామని చెప్పారు. దిల్లీలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎంపీలు, తెలుగుదేశం నేతల సమావేశంలో కనకమేడల పాల్గొన్నారు.

Tags :

మరిన్ని