TDP: పోలింగ్‌ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు: తెదేపా ఏజెంట్‌

పోలింగ్‌ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు తనపై దాడి చేశారని కండ్లకుంట తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ మాణిక్యరావు ఆరోపించారు.

Published : 26 May 2024 15:19 IST

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పోలింగ్‌ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. అంతు చూస్తామని నన్ను బెదిరించారు. తెదేపా ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నా కుటుంబం పైనా దాడి చేశారు. తెగించి తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నా’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు