విద్యుత్‌ కొనుగోళ్లలో కేసీఆర్‌ సహా 25 మందికి నోటీసులు: జస్టిస్ ఎల్‌.నర్సింహారెడ్డి

తెలంగాణలో విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు.

Updated : 11 Jun 2024 16:25 IST

తెలంగాణలో విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు. యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ నరసింహారెడ్డి జ్యుడిషియల్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఈ అంశంలో కేసీఆర్‌, సురేశ్‌ చందా, అజయ్‌ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు.

Tags :

మరిన్ని