Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సైకిల్‌పై వచ్చిన తెదేపా కార్యకర్త

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార వేడుకను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు గన్నవరానికి తరలివస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన తెలుగుదేశం కార్యకర్త సతీశ్ సైకిల్‌పై కేసరపల్లికి విచ్చేసి ప్రత్యేకంగా నిలిచారు.

Published : 11 Jun 2024 19:26 IST

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార వేడుకను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు గన్నవరానికి తరలివస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన తెలుగుదేశం కార్యకర్త సతీశ్ సైకిల్‌పై కేసరపల్లికి విచ్చేసి ప్రత్యేకంగా నిలిచారు. గతంలోనూ చంద్రబాబు అరెస్టు సమయంలో సైకిల్‌పైనే రాజమండ్రికి వెళ్లినట్లు సతీశ్ చెప్పారు. చంద్రబాబుపై అభిమానంతోనే సైకిల్‌పై ఈ వేడుకకు వచ్చినట్లు వివరించారు.

Tags :

మరిన్ని