AP News: ఏపీలో చరిత్ర సృష్టించిన కూటమి గెలుపు

ఐదేళ్ల క్రితం అసాధారణ మెజార్టీతో వైకాపాను అధికారం పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడా పార్టీని అథఃపాతాళానికి తొక్కేశారు. తెదేపా, జనసేన, భాజపా కూటమికి కనీవినీ ఎరగని విజయాన్ని కట్టబెట్టారు.

Published : 05 Jun 2024 09:33 IST

ఆంధ్రప్రదేశ్‌ అంతగా ఒకటే గెలుపు గీతం.  ఉత్తరాంధ్రా.. రాయలసీమా, పట్టణమా.. గ్రామీణమా, ఎస్సీ స్థానమా.. ఎస్టీ నియోజకవర్గమా అనే తేడాలేకుండా అంతటా తెలుగుదేశం కూటమి ప్రభంజనమే. కుప్పం నుంచి పాతపట్నం దాకా ప్రజలంతా కూడబలుక్కున్నట్టుగా కూటమి వెంట నిలిచారు. ఆంధ్రావని చరిత్రలో అనన్యసామాన్య విజయాన్ని అందించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టుకట్టి కూటమి పార్టీలు సృష్టించిన పెనుగాలికి ఫ్యాన్ రెక్కలు తుక్కు తుక్కు అయ్యాయి. వైకాపా కేవలం ఐదు జిల్లాల్లో ఉనికి చాటుకుంది. 8 జిల్లాల్లో కనుమరుగైంది! 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు