Pulivarthi Nani: హత్యాయత్నానికి పాల్పడిన వైకాపా కార్యకర్తలను వదిలేశారు: పులివర్తి నాని

తనను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి అమాయకులపై కేసులు పెట్టి పోలీసులు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి పులివర్తి నాని ఆరోపించారు.

Updated : 23 May 2024 20:38 IST

తనను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి అమాయకులపై కేసులు పెట్టి పోలీసులు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్ధి పులివర్తి నాని ఆరోపించారు. ఈ నెల 14న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై ఎస్వీయూ పోలీస్‍ స్టేషన్‌లో నానిని గంటకుపైగా డీఎస్పీ రవిమనోహర ఆచారి విచారించారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులను కేసులో ఇరికించారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాని తెలిపారు. 70మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. తనకు, తన కుటుంబానికి పోలీసు భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రీపోలింగ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని.. కౌంటింగ్ సక్రమంగా నిర్వహించే బాధ్యత అధికారులు తీసుకోవాలని ఆయన కోరారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు