TDP: వ్యక్తి అభిమానం.. తెదేపా గెలిచిందని ఉచితంగా ‘టీ’

చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలానికి చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు.

Updated : 05 Jun 2024 11:25 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగించింది. తెదేపా (TDP) అత్యధిక స్థానాల్లో గెలవడంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలానికి చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. బెల్లం నజీర్ అనే వ్యక్తి తన దుకాణంలో ఒక రోజు ‘టీ ఉచితం’ అని ప్రకటించారు. ప్రజలు తన కొట్టులో బుధవారం ఉచితంగా టీ తాగొచ్చని తెలిపాడు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నజీర్‌ ఆకాంక్షించారు.

Tags :

మరిన్ని