Julakanti: ఏపీ ప్రభుత్వ పెద్దల సాయంతోనే పిన్నెల్లి పరారీ!: బ్రహ్మారెడ్డి

ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వ పెద్దల సాయంతోనే పారిపోయారని తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు.

Published : 23 May 2024 12:27 IST

ఈవీఎం ధ్వంసం కేసులో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కాకుండా పారిపోవటానికి సజ్జల వంటి ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు పోలీసు అధికారులు సహకరించారని తెదేపా నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గంటలో మాచర్ల వస్తానని సవాల్ విసిరిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలన్నారు. వైకాపా దాడుల్లో గాయపడిన తెదేపా కార్యకర్తల్ని పరామర్శించేందుకు ఛలో మాచర్ల కార్యక్రమం పెడితే పోలీసులు అడ్డుకోవటాన్ని తప్పుబట్టారు. 

Tags :

మరిన్ని