Pulivendula: పులివెందులలో స్కూటర్‌కు ఫ్యాన్‌ను కట్టుకొని.. తెదేపా శ్రేణుల సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో తెదేపా (TDP) శ్రేణుల సంబరాలకు అవధులు లేకుండాపోయాయి.

Published : 07 Jun 2024 18:15 IST

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో తెదేపా (TDP) శ్రేణుల సంబరాలకు అవధులు లేకుండాపోయాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో తెదేపా కార్యకర్తలు వినూత్నంగా గెలుపు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన ముగిసిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఫ్యాన్‌ను ద్విచక్రవాహనాలకు కట్టుకొని రోడ్లపై తిరిగారు. చక్రాయపేట బస్టాండ్ సమీపంలో పలువురు తెదేపా కార్యకర్తలు ఫ్యాన్ రెక్కలు విరిచేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు