TDP: కేంద్ర క్యాబినెట్‌లో.. 2 నుంచి 4 స్థానాలు!

సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం కేంద్ర మంత్రివర్గంలో చేరనుంది. కనీసం రెండు నుంచి గరిష్టంగా నాలుగు స్థానాలు ఆ పార్టీ ఎంపీలకు లభించే అవకాశముందని సమాచారం.

Published : 07 Jun 2024 09:26 IST

సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం కేంద్ర మంత్రివర్గంలో చేరనుంది. కనీసం రెండు నుంచి గరిష్టంగా నాలుగు స్థానాలు ఆ పార్టీ ఎంపీలకు లభించే అవకాశముందని సమాచారం.  లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయేలో భాజపా తర్వాత తెలుగుదేశానికే అత్యధికంగా 16 స్థానాలు లభించాయి. దిల్లీలో జరిగిన ఎన్డీయే భేటీకి హాజరైన చంద్రబాబుని కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం కూడా భాగస్వామి కావాలని ప్రధాని మోదీ ఆహ్వానించగా.. అప్పటికప్పుడే అంగీకరించినట్లు సమాచారం.

Tags :

మరిన్ని