Chandrababu: చంద్రబాబును చూసేందుకు కాన్వాయ్ వెంట మహిళ పరుగు!

తెదేపా అధినేత చంద్రబాబును చూసేందుకు ఆయన కాన్వాయ్ వెంట ఓ మహిళ పరుగులు పెట్టింది. ఆమెను చూసిన చంద్రబాబు వెంటనే కారు ఆపారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి చంద్రబాబు మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ.. చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని చెప్పింది.

Updated : 11 Jun 2024 15:23 IST

తెదేపా అధినేత చంద్రబాబును చూసేందుకు ఆయన కాన్వాయ్ వెంట ఓ మహిళ పరుగులు పెట్టింది. ఆమెను చూసిన చంద్రబాబు వెంటనే కారు ఆపారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి చంద్రబాబు మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ.. చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని చెప్పింది. తనను చూసి భావోద్వేగానికి గురైన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చానని నందిని చెప్పగా.. ముందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.  

Tags :

మరిన్ని