AP News: వైకాపా ఓటమి ఖాయం: తెదేపా నేత ఆనం రామనారాయణ

జగన్ పాలనలో అన్నీ అరాచకాలేనని ఆఖరికి పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా వైకాపా మూకలు బరితెగించి హింసకు పాల్పడ్డాయని ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 17 May 2024 16:24 IST

జగన్ పాలనలో అన్నీ అరాచకాలేనని ఆఖరికి పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా వైకాపా మూకలు బరితెగించి హింసకు పాల్పడ్డాయని ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఏజెంట్లపై దాడులు వైకాపా దాష్టీకానికి నిదర్శనమన్నారు. వైకాపా ఓటమి ఖాయమని ఐప్యాక్ సిబ్బందితో జగన్ తీసుకున్న సెల్ఫీ చివరిదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఆనం ధీమా వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని