YSRCP: చంద్రబాబు, పవన్‌కు మద్దతుగా వైకాపా మాజీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు

అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెదేపా, జనసేనకు మద్దతుగా వైకాపా (YSRCP) మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.

Published : 07 Jun 2024 19:29 IST

అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెదేపా, జనసేనకు మద్దతుగా వైకాపా (YSRCP) మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు.. మల్లికార్జున రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఆ బ్యానర్లపై ఉంది. ఈనెల 12న నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా ఇలాంటి బ్యానర్లు వేయాలని నిర్ణయించినట్లు మేడా వర్గీయులు వెల్లడించారు. మేడా సోదరుడు రఘునాథ్‌రెడ్డి ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే మేడాకు టికెట్‌ దక్కకపోవడంతో ఆయన ఈ ఎన్నికల్లో తెదేపాకు అనుకూలంగా పనిచేయడం గమనార్హం.

Tags :

మరిన్ని