Andhra news: జగనన్నా.. ‘మెగా డీఎస్సీ ఏదన్నా?’

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకొని ఏళ్లపాటు శ్రమిస్తున్నారు వారంతా. కలల ఉద్యోగం కోసం కన్నవారికి, కట్టుకున్నవారికీ దూరంగా ఉంటూ అహర్నిశలు శ్రమిస్తున్నారు . అందుకు సరైన వేదిక కృష్టాజిల్లా అవనిగడ్డ. ఏళ్ల తరబడి అక్కడే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. కానీ, డీఎస్సీ నోటిఫికేషన్‌ రాకపోవడంతో తమ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోందని వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.  నోటిఫికేషన్‌ కోసం వెయ్యికళ్లతో వేచిచూస్తున్న తమకు జగన్ ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌పై దృష్టి సారించిన సీఎం జగన్, డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎందుకు జారీ చేయడం లేదని ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

Published : 21 Dec 2023 23:16 IST

Tags :

మరిన్ని