క్లర్కు నుంచి కలెక్టర్ వరకూ..
ఐఏఎస్, ఐపీఎస్.. ఆర్డీవో, ఎమ్మార్వో.. సబ్ ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్.. లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్ .. పీవో, ఏవో... ఇవే కాదు- క్లర్కు నుంచి కలెక్టర్ వరకూ ఎన్నో ఉద్యోగాలకు సాధారణ డిగ్రీ సరిపోతుంది. మూడేళ్ల కోర్సులో ఉన్నప్పుడే కెరియర్ లక్ష్యాన్నిబట్టి పోటీ పరీక్షల సన్నద్ధత కొనసాగిస్తే డిగ్రీ పట్టా, కలల కొలువూ సొంతమవుతాయి! పెద్ద ఉద్యోగాలన్నీ మేటి సంస్థల్లో, అత్యున్నత కోర్సులు చదివితేనే సాధ్యమనే భావన ఎక్కువ మందిలో ఉంటుంది.