Chandrababu: గూగుల్‌తో ఒప్పందం.. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి: సీఎం చంద్రబాబు

Eenadu icon
By Video News Team Published : 12 Dec 2024 09:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

 

 

 

ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లో పటిష్ఠమైన టెక్నాలజీ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్‌ (Google) సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం సమక్షంలో అధికారులు, గూగుల్‌ ప్రతినిధులు దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ వార్త చదివారా: మరింత మెరుగ్గా.. మెరికల్లా!

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు