Karnataka: హనీ ట్రాప్‌ వ్యవహారంపై కర్ణాటక అసెంబ్లీలో దుమారం

Eenadu icon
By Video News Team Published : 21 Mar 2025 15:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కర్ణాటకలో మంత్రులు సహా అనేకమందిపై ‘హనీ ట్రాప్‌’ (Honey Trap) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో భాజపా నేతలు లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. హనీ ట్రాప్‌పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్‌ చేయడాన్ని విమర్శిస్తూ.. స్పీకర్‌ చుట్టూ చేరి నిరసన తెలిపారు. భాజపా నేతల తీరుపై సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి కేసు నమోదై.. దర్యాప్తు ప్రారంభం అయితే హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ వార్త చదివారా: సందేశం చూడు.. నెటిజన్‌కు ఆనంద్‌ మహీంద్రా చురక

Tags :

మరిన్ని