MUDA scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ

Eenadu icon
By Video News Team Published : 24 Sep 2024 20:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ (MUDA scam) కలకలం సృష్టిస్తోన్న తరుణంలో.. హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్, ముఖ్యమంత్రి, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కోర్టు ఈ రోజుకు తీర్పు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు