Suryakumar Yadav: జకోవిచ్ రాసిన ఆ పుస్తకం చదివి స్ఫూర్తి పొందా!: సూర్యకుమార్ యాదవ్

Eenadu icon
By Video News Team Published : 10 Jul 2025 22:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఇంగ్లాండ్ వేదికగా వింబుల్డన్ హోరాహోరీగా సాగుతోంది. సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ రౌండ్ 16 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ మినార్‌ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్‌ను భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్‌తోపాటు సూర్యకుమార్ యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా స్టార్‌స్పోర్ట్స్‌తో సూర్య మాట్లాడాడు. జకోవిచ్‌ను అతని కెరీర్ ప్రారంభం నుంచి ఫాలో అవుతున్నానని, జకోవిచ్ రాసిన ‘సర్వ్ టూ విన్’ అనే పుస్తకాన్ని చదివానని పేర్కొన్నాడు. దాన్నుంచి ఎంతో స్ఫూర్తి పొందానన్నాడు. టెన్నిస్‌లోని ఏ షాట్‌ను క్రికెట్‌లో ఆడతావని ప్రశ్నించగా.. ట్వినర్ షాట్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. టెన్నిస్ పరిభాషలో ఆటగాడు వెనుకకు పరుగెత్తి కాళ్ల మధ్య నుంచి బంతిని కొట్టినప్పుడు దానిని ‘ట్వీనర్’ అంటారు. ఈ వార్త చదివారా: ఇంగ్లాండ్, భారత్ మూడో టెస్టు.. మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు